భారత దేశంలో శరీర ఆకృతిని తీర్చిదిద్దటం లేదా లైపోసక్షన్
లైపోసక్షన్ అనే పదము కొవ్వును తీసివేయుడానికి వ్యతిరేక పీడనం అని అర్థం వచ్చే సక్షన్ అనే పదం నుండి పుట్టింది. కాబట్టి లైపోసక్షన్ అనేది ప్రధానంగా పొట్ట భాగం నుండి అధిక చర్మాన్ని, కొవ్వును తొలగించడం కోసం ఉపయోగించే విధానము. కానీ ఇప్పుడు చిన్న రంధ్రాల ద్వారా శరీర అన్నిభాగాలకు ఈ చికిత్స ఉపయోగిస్తున్నారు. లేపోసక్షన్ లేదా శరీర ఆకృతి చికిత్స లావు తగ్గింపుతో పాటు శరీర రూపాన్ని తీర్చి దిద్దడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియను లైపోస్కల్ప్చర్ అని కుడా పిలుస్తారు. అంటే లిపోసక్షన్ - శరీరంలో కొవ్వు తొలగించడం ద్వారా శరీరానికి పునరాకృతి తీసుకురావటం అని అర్థం. కొవ్వు అధికంగా గల ప్రాంతాల నుండి తొలగించడం మరియు ఆకృతి తక్కువగా ఉన్న చోట కొవ్వు చేర్చటం (ఇన్జెక్షన్) ద్వారా ఇది మీ శరీరానికి ఖచ్చితమైన ఆకారాన్ని అందిస్తుంది.
PATIENT FEEDBACK VIDEOS
లైప్రోసక్షన్ ఎయే భాగాలలో చేయవచ్చు
చర్మం క్రింద కొవ్వు పెరిగే పిరుదులు, తొడలు, నడుము, చేతులు, రొమ్ము, కంఠము మరియు ముఖం వంటి శరీరపు ఏభాగంలోనైనా చేయవచ్చు. ఈ విధానం క్రింది విధాలుగా ఉంటుంది
పొత్తి కడుపు, నడుము లైపోసక్షన్ తో కడుపు ఆకృతి సరిదిద్డడం
ఈ ప్రక్రియలో నడుము, పొట్ట భాగాలలో ఒకేసారి లిపోసక్షన్ జరుగుతుంది. కాస్మెటిక్ చికిత్స వైద్యులు రొమ్ము క్రింద మొదలుకొని పొత్తి కడుపు క్రింద వరకు చర్మం క్రింద కొవ్వు తొలగించడం ద్వారా పొట్టభాగపు ఈ చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియలో అవసరం మేరకు కొంత యోని పెదవులకు కుడా లిపోసక్షన్ చేయవలసి రావచ్చు.
పొట్ట క్రింది భాగపు లిపోసక్షన్
చదునైన పొట్టను తీసుకురాడానికి ఈ చికిత్సను పొత్తికడుపు ప్రాంతంలో మాత్రమే చేస్తారు.
మోనో ప్యుబిస్ లిపోసక్షన్ఈ చికిత్స జననేంద్రియాల వద్ద జరుగుతుంది. జననేంద్రియాలను పునరుజ్జీవనపరచడానికి యోని, శిశ్నముల పరిమాణాల్ని సరిచేస్తారు.
తొడలు (సేడిల్ బ్యాగ్స్) మరియు నడుము చుట్టు (లవ్ హ్యాండిల్స్) లిపోసక్షన్ నిర్వహించడం
సేడిల్ బ్యాగ్స్ స్త్రీలలో సర్వ సాధారణం. ప్లాన్క్ (నడుముపై భాగం), ఎగువ తొడ వెలుపలి భాగంలో అదనపు కొవ్వు పేరుకుపోయి మధ్య భాగం నొక్కుకుపోయి ఉంటుంది.
పురుషులలో పొట్ట భాగపు (అబ్డామినల్) లైపోసక్షన్
పురుషులలో పొట్ట భాగంలో కొవ్వు తగ్గింపు కోసం, తేలికైన, సరైన ఆకారం గల పొట్ట కోసం దీనిని చేస్తారు. ఆహారం నియంత్రణ ద్వారా తగ్గని కొవ్వు ఈ శాస్త్ర చికిత్స ద్వారా తొలగించబడుతుంది.
బాడీ కౌంటౌరింగ్ఇది ఒక స్థానములో అదనపు కొవ్వును తొలగించడమే కాక, కొరత ఉన్న, అవసరమయ్యే భాగాలలో నింపి కొవ్వును పునర్వినియోగపరిచి శరీర ఆకృతి సరిచేసే ఒక సంపూర్ణ ప్రక్రియ.
తొడ మరియు పిరుదుల లైపోసక్షన్
ఈ ప్రక్రియలో నడుము, తొడలు మరియు పిరుదుల నుండి అదనపు కొవ్వు తొలగించబడుతుంది. తద్వారా మందపాటి చర్మము ఉండే ఈ ప్రాంతాల కదలిక తేలిక అవుతుంది. ఈ ప్రక్రియలో అవసరాన్ని సంపూర్ణమైన నడుము, కాళ్ళ ఆకృతికై బట్టి కాళ్ళ లైపోసక్షన్ కూడా జోడిస్తారు.
పిరుదుల లైపోసక్షన్ లిఫ్ట్
ఈ ప్రక్రియలో కొవ్వు తోలిగించటం ద్వారా మాత్రమె కాక చర్మం సంకోచం చేయడం ద్వారా కుడా పిరుదులసర్దుబాటు చేయబడుతుంది.
ఫేస్ లైపోసక్షన్ముఖం యొక్క రూపాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకొనేవారు సాధారణంగా ఈ ప్రక్రియను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియలో బుగ్గలు, కంఠం ప్రాంతాల్లో కొవ్వు తొలగించడం, మరియు ముఖాన్ని మెరుగు పరచడానికి బోలు/చక్కి బుగ్గలు వంటి అవసరమైన ప్రాంతాల్లో ఈ కొవ్వును పునర్వినియోగిస్తారు.
బాడీ స్కల్పింగ్ ప్రక్రియ
శరీరానికి సరైన ఆకృతి తీసుకురాడీనికి ఈ శస్త్రచికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స సమయంలో నొప్పి, అసౌకర్యం లేకుండా అనస్థీషియా ఇచ్చి ఈ చికిత్స చేస్తారు. చికిత్స అవసరం మరియు చికిత్స చేసే భాగం యొక్క పరిమాణం బట్టి ఈ పద్ధతికి 1-2 గంటలు పడుతుంది. ఈ శస్త్రచికిత్సలో, కొవ్వు తొలగించడం కోసం చిన్న రంధ్రాలు చేయబడతాయి. శరీరానికి సౌందర్యవంతమైన చక్కని ఆకారం ఇవ్వడానికి మచ్చ లేకుండా రంధ్రాలు మూసివేయబడతాయి. భారతదేశంలో తక్కువ ధరకే ప్రజలకు కావలసిన ఆకారాన్ని పొందటానికి, యవ్వన రూపాన్ని పదిల పరచడానికి ఈ లైపోసక్షన్ శస్త్రచికిత్స అవకాశం కల్పిస్తుంది.