వైజాగ్ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్
వైజాగ్ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్
మా క్లినిక్ గుర
డా. సి. విజయ్ కుమార్, ఎం.డి. ఎఫ్.ఎ.ఐ.ఎం.ఎస్, ఎఫ్.ఐ.సి.ఎస్.(చికాగో), ఎం.ఎ.ఎం.ఎస్ (వియెన్నా) గారికి శాస్త్ర చికిత్సలో 35 సంవత్సరాలకు పైగా అపార అనుభవం కలదు. ఆయనకు గల అమోఘ నిపుణతతో ఎన్నో కఠినమైన చికిత్సలను నిర్వహించి శస్త్రచికిత్సలలో తన విశిష్ఠ ముద్రను వేసారు. ఉన్నతమైన సేవలను అందిస్తారు కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక మరియు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలలో అత్యుత్తమ ఆసుపత్రులు డాక్టర్ విజయ్ కుమార్ గారి సంప్రదింపును ఆశ్రయిస్తునాయి. ప్రముఖ వైద్య కళాశాలలో ఆచార్యునిగా, డాక్టరుగా ఆయన అందించే సేవలు ఇటు విద్యార్ధులు, అటు వైద్యుల సమాజాన్ని అమిత విశ్వాసంతో ఆయనకు దగ్గరచేసాయి. స్వతహాగా ఆయన మంచి చదువరి, జిజ్ఞాసి అయినందువలన శాస్త్రచికిత్స రంగంలో జరిగే పురోగతిని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ నవీన సేవలను అందిస్తారు.
కాస్మెటిక్ శాస్త్ర చికిత్స పట్ల గల అమిత ఆసక్తి, పుర్వ అనుభావము, దేశంలో గొప్ప మేథావుల ప్రమాణీకరణతో శరీర అన్ని భాగాలకు సంబంధించి అన్ని విధాల చికిత్సలను అందించే సౌందర్య చికిత్సా కేంద్రాన్ని డాక్టరు గారు అత్యాధునుక ప్రమాణాలతో నగరంలో ఏర్పాటు చేసారు. ఈకేంద్రం నాణ్యత, సేవల విషయంలో మన దేశంలో ఈ రంగంలో అత్యుత్తమ సేవలను అందిస్తున్న మిగిలిన కేంద్రాలతో పోటీపడుతుంది. డాక్టరుగారు నిష్ణాతులైన డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్ల బృందానికి నాయకత్వం వహిస్తారు. విస్తారమైన అనుభవం గల వీరు శాస్త్ర చికిత్సలలో డాక్టరుగారికి సహాయపడతారు. శాస్త్ర చికిత్స, కాస్మెటాలజీలలో అన్ని విధాల అవసరమగు సిబ్బందిని ఈ కేంద్రం కలిగి ఉంది.
డా.విజేఎస్ యొక్క సేవలు పొందేవారి సంతృప్తే మాకు ప్రథమం. హెయిర్ కేర్, హెయిర్ ట్రాన్స్.ప్లాంటేషన్, కాస్మెటిక్ శస్త్ర చికిత్సలలో ప్రపంచ స్థాయి ఉపకరణాలు, నిపుణులు, అనుభవజ్ఞులైన వైద్యులు, చికిత్స అనంతరం పర్యవేక్షణ ద్వారా మేము అందించే సేవలు ఎప్పటికీ మమ్మల్ని గుర్తుంచుకొనేలా చేస్తాయి. ఆంధ్రప్రదేశ్.లో గల మూడు స్మార్ట్ సిటీలలో రెండింటిలో మాక్లినిక్.లు ఉన్నాయి. రాబోయే ఎళ్ళలో ఖచ్చితంగా కాస్మెటిక్ శాస్త్ర చికిత్స, హెయిర్ ట్రాన్స్.ప్లాంటేషన్ సేవలలో మేము ప్రముఖంగా నిలుస్తాము.
మా బృందం
డా.విజేఎస్ ప్రపంచంలో అత్యుత్తమ సర్జన్లు, సహాయక వైద్యులు, సాంకేతిక, నిర్వాహక సిబ్బంది బృందాన్ని కలిగి ఉంది. మా సేవలను పొందేవారి సంతృప్తే ప్రధాన లక్ష్యంగా గల ఈ బృందం సమిష్ఠిగా కాస్మెటిక్, హెయిర్ ట్రాన్స్.ప్లాంటేషన్.లలో అత్యుత్తమ సేవలను అందించడానికి కృషి చేస్తుంది.
- సుశిక్షితులైన వైద్యుల బృందం అత్యుత్తమ చికిత్సకై సమగ్ర విశ్లేషణ, నివేదికలను అందివ్వడానికి పరిశ్రమిస్తారు
- సుశిక్షితులైన సాంకేతిక నిపుణుల బృందం భద్రత, పరిశుభ్రతలు ప్రమాణాలుగా పనిచేస్తారు. సాంకేతిక నిపుణుల సమిష్ఠి కృషి వలన మా వద్ద చేరే వారు భద్రత, పరిశుభ్రతల విషయంలో అత్యంత సంతృప్తిని పొందుతారు.
- నిర్వాహక సిబ్బందికి మావద్ద చేరేవారి సౌకర్యమే ప్రాధమ్యం. వీరు సత్వరమే స్పందిస్తూ, మృదువుగా మాట్లాడుతూ స్నేహపుర్వకమైన, సానుకూల వాతావరణాన్ని కలిగిస్తారు. తద్వారా ఇక్కడకు వచ్చేవారికి ఇంటివద్దే ఉన్నంత సదుపాయం అందేలా చూస్తారు.
డా.విజఎస్ మాత్రమే ఎందుకు?
హెయిర్ రీస్టోరేషన్, కాస్మెటిక్ సర్జరీలో ఆంధ్రప్రదే..లో మాది ప్రధాన కేంద్రం. గత రెండు సంవత్సరాలుగా 2000 మందికి పైగా చికిత్సలను అందించాము. మా కేంద్రాలకు వచ్చారంటే అత్యుత్తమమైన, సురక్షితమైన వారివద్దకు వచ్చామని మీరు నమ్మవచ్చు. మా విధానాలు, చికిత్స, చికిత్స అనంతర సేవలు, తద్వారా మీరు పొందే అంతిమ ఫలితం విషయంలో మేము అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తాము.
స్త్రీలలో జుట్టు రాలడానికి కారణం ఏమిటి?
్త్రీలలో అనేక కారణాల వలన జుట్టు రాలటం సంభవిస్తుంది. వైద్యులను సంప్రదించినంతవరకు కారణం తెలుసుకోలేరు. క్రింద కొన్ని కారణాలు ఉన్నాయి
- 1. హార్మోన్ల అసమానత
స్త్రీలలో హార్మోన్ల అసమానతలకు అనేక సందర్భాలు కారణమవుతూ ఉంటాయి. వాటిలో గర్భధారణ, ఒత్తిడి, జనన నియంత్రణ మాత్రలు ఉపయోగించడం, జుట్టురాలే క్రమం వంటివి ఉంటాయి. ఈస్ట్రోజెన్ మరియు డి.హెచ్.టిల అధిక ఉత్పత్తి ఉన్నపుడు స్త్రీలలో హార్మోన్ల అసమానత జుట్టు నష్టానికి దారితీస్తుంది. - 2. చికిత్సలు
కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాదులు ఇందులోకి వస్తాయి. ఉన్నాయి. శరీర రోగనిరోధక వ్యవస్థపై వాటి ప్రభావం వలన అలా జరుగుతుంది. - 3. ఇతర కారణాలు
థైరాయిడ్ గ్రంథి లోపం, తలపై చర్మ వ్యాధులు, నిద్ర లేమి, పొగతాగడం, జుట్టుకు సరైన సంరక్షణ లేకపోవటం, మరియు ఇతర గుర్తించలేని కారణాలు.
ఇతర కేంద్రాలకంటే మా ప్రత్యేకతలు
అనుభవం: మాతో పని చేసేవారికి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉంటుంది. అత్యధికంగా మా డాక్టరు గారికి 35 సంవత్సాల అనుభవం కలదు. సాంకేతిక ప్రక్రియ: మార్పు, నవీనతలను మేము అనుసరిస్తాము. ఎప్పటికప్పుడు నూతనీకరణను అవలంబిస్తూ ఉంటాము. ట్రైనోక్యులర్ మైక్రోస్కోప్స్, రెమీ పి.ఆర్.పి సెంట్రిఫ్యూజ్ మొదలగునవి అటువంటి అభివృద్ధికి చిహ్నాలు. చికిత్స అనంతర సేవలు: చికిత్స పొందినవారిని తరుచు సంప్రదిస్తూ అత్యుత్తమమైన చికిత్స అనంతర సేవలను అందిస్తాము. ఇందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సిబ్బంది నియమించబడ్డారు. భద్రత: భద్రత అత్యంత ప్రముఖమైన అంశము. నూటికి నురుపాళ్ళు సురక్షతకు మేము హామీ ఇస్తున్నాము. మీరు అత్యంత సురక్షితమైన వారిని చేరారని మేము వక్కానిస్తున్నాము. ఖచ్చితమైన ఫలితాలు: సాఫల్యానికి ఫలితాలే మకుటం. ఈ రంగంలో మార్గదర్శకులుగా ఉన్న మాకు చెప్పిన ఫలితాలను అందించడం బాధ్యత. ఇప్పుడ, ఎప్పుడు మేము ఇదే పాటిస్తాము. మా ధరలు: ఇతరుల వలె మేము వ్యాపార కేంద్రాలను నడుపము. చెల్లించే ప్రతి పైసాకు తగిన అత్యుత్తమ సేవలను అందిస్తాము. మా ధరను తెలియజేసే గణనను ఉపయోగించి దీనిని మీరే చూడవచ్చు.
జుట్టు ఊడిపోవటం, సాధ్యమయ్యే చికిత్సలు
రాబోయే కాలంలో సుమారు 75% మంది పురుషులకు బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఏ వయసులో బట్టతల వస్తుంది అన్నదానిని వారి జీవన సరళి, అలవాట్లు, వంశానుగతి నిర్ణయిస్తాయి. జుట్టు ఊడిపోవటం క్రమంగా బట్టతలగా పరిణామం చెందుతుంది. తీరికలేకపోవటం వలన చాలామంది దీనిని సకాలంలో గుర్తించరు..
పురుషులలో జుట్టు ఉడడం
స్త్రీ, పురుషులు ఇద్దరిలో కుడా జుట్టు రాలిపోతుంది. అయితే ఇది పురుషులలో అధికం. పురుషులలో జుట్టు రాలిపోవాడం క్రమ క్రమంగా సంభవిస్తుంది. ఇది తల ముందుభాగంలో బట్టతలగా ప్రారంభమై క్రమంగా చుట్టుప్రక్కల ప్రాంతానికి ప్రాకుతుంది.
పురుషులలో జుట్టు రాలటానికి కారణాలు
- వంశానుగతం- సాధారణంగా పురుషులలో బట్టతల జన్యుపరమైన రుగ్మతల వలన సంభవిస్తుంది.
- వృద్ధాప్యం – కొందరు పురుషులకు 60 సంవత్సరాల వయస్సులో బట్టతల వస్తుంది. బహుసా దీనికి కణాల క్షీణత కారణం కావచ్చు.
- హార్మోన్ల మార్పులు- ముఖ్యంగా పురుష హార్మోన్ల లోపాల కుడా సంభవించవచ్చు
- థైరాయిడ్ లోపము లేదా అసమతుల్యత
- ఒత్తిడి – తీరికలేని పని కారణంగా, విశ్రాంతి లేకపోవటం వలన కుడా జుట్టు రాలిపోవచ్చు. చికిత్సలు – రేడియోథెరపీ మరియు కీమోథెరపీ వంటివాటి వలన
- జీవనశైలి- నిద్ర లేమి, ధూమపానం, మరియు ఆహారలోపము మొదలగునవి
- ట్రామా- ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదకరమైన గాయాలు వలన కలగవచ్చు
పురుషులలో జుట్టు సమస్యల రకాలు
పురుషులలో జుట్టు సమస్యలు క్రిందివిధంగా ఉంటాయి. అయితే అవి సాధారణ జుట్టు సమస్యలకు భిన్నం కాదు.
- .అలోపేసియా ఐరాటా: తలపై చిన్నవి మరియు మృదువైన జుట్టు లేని ప్రాంతాలు ఏర్పడటం. ఇది అలోపేసియా మోనోలక్యులారిస్, టొటాలిల్, మరియు అలోపేసియా యూనివర్సలిస్.గా విభజించబదుతుంది.
- ఆండ్రోజెనిక్ అలోపేసియా: జుట్టురాలటంలో ఇది సాధారణ రకం. ముఖ్యంగా తల ముందు ప్రాంతంలో జుట్టు పలచబడటంతో ఇది మొదలవుతుంది. క్రమంగా సమీప ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది.
- ట్రైకోటిల్లోమానియా: క్లిష్ట పరిస్థితులలో తన జుట్టును తానె తీసేసుకొనే ఒక మానసిక పరిస్థితి
- సికాట్రిసియాల్ అలోపెసియా, మరియు ట్రాక్షన్ అరోపికా మొదలగునవి ఇతర రకాలు
రోగనిర్ధారణ విధానాలు
ప్రయోగశాల పరీక్షలు మరియు తలపైచర్మ పరీక్షల ద్వారా బట్టతల లేదా జుట్టురాలటం రకాన్ని నిర్ధారించవచ్చు. పూర్తి ఫలితాల కోసం హెయిర్ సర్జన్ లేదా చర్మవ్యాధి నిపుణుని సంప్రదింపు అవసరం
- థైరాయిడ్ పరీక్షలు జరపాలి
- ఐరన్ టెస్ట్
పురుషులలో జుట్టు రాలడాన్ని నివారించడానికి గల చికిత్సలు
పురుషులలో జుట్టురాలటం యొక్క రకము, కారణంను అనుసరించి సర్జికల్ మరియు నాన్సర్జికల్ చికిత్సలను ఎన్నుకుంటారు. జుట్టు రాలటానికి చేసే చికిత్సలు భారతదేశంలో కింది విధంగా ఉన్నాయి:
శాస్త్ర చికిత్స అవరంలేని చికిత్సలు:
- 1. స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్జుట్టు రాలడానికి చేసే చికిత్సలలో ఇది నూతనమైనది. ఈ విధానంలో ప్రభావితమైన భాగంలోకి పిగ్మెంట్లను ప్రవేశపెడతారు. జుట్టు రంగు, పొడవుల మీద ఆధారపడి పిగ్మెంట్లను ఎన్నుకుంటారు. ఇది స్త్రీ, పురుషులలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఓ విధమైన పచ్చబొట్టు (టాటూ) పధ్ధతి.
- 2. ఫినాస్టెరైడ్ మరియు మినాక్సిడిల్ (రోగెయిన్)జుట్టు రాలడానికి చేసే చికిత్సలలో ఇవి అత్యంత ఆదరణ పొందిన, ఆమోదించబడిన సంప్రదాయ చికిత్సలు. పురుషులలో ఫినాస్టెరైడ్ అత్యంత సాధారణమైన చికిత్స.
- 3. థెరపీలుపి.ఆర్.పి థెరపీ, మెసోథెరపీలు దీనిక్రిందకు వస్తాయి. వైద్యులు మీ రక్తం నుండి ప్లేట్లెట్.లు ఎక్కువగా ఉండే ప్లాస్మాని సేకరించి తలపై చర్మంలో ప్రవేశపెడతారు. తద్వారా మీ జుట్టు పునరుద్ధరించబడుతుంది. మెసోథెరపీలో, జుట్టు పెరుగుదలను పెంచడానికి వైద్యులు మీ జుట్టులోకి వివిధ విటమిన్లను ప్రవేశపెడతారు.
- 4. హెయిర్ ఎక్స్టెన్షన్స్వీటిలో తాజాగా మెష్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, వేవ్స్ మొదలగువాటిని స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఉపయోగిస్తున్నారు.