కాకినాడ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ | కాకినాడలోని హెయిర్ క్లినిక్

కాకినాడ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్

కాకినాడ లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్

డా.విజేఎస్ కాస్మెటిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాన్ని ఎందుకు ఎన్నుకోవాలి

ప్రముఖమైన మా జుట్టు మార్పిడి కేంద్రంలోని నిపుణులు జుట్టు రాలిపోవడంతో బాధబడే అనేక రకాల రోగులతో పనిచేసారు. కళాత్మక మరియు సౌందర్య నైపుణ్యాలతో, వారు రోగులకు సహజమైన, ఉత్తమమైన ఫలితాలను అందించారు. మెరుగైన మరియు అత్యుత్తమ ఫలితాల కోసం ఈవిధమైన నిపుణులు అవసరమన్న వాస్తవాణ్ని అలక్ష్యం చేయకండి.

మహిళల్లో జుట్టు రాలటం. దానిని వారు అధిగమించగలరా?

జుట్టు నునుపు చేసుకోవడం(స్త్రైటనింగ్), హాట్ కోంబింగ్, బ్రైడింగ్ వలన జుట్టును కోల్పోతాయి. జుట్టు రాలటం కొంతవరకు సాధారణమైనది అయినప్పటికీ చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించవలసిన స్థితి కుడా ఉంటుంది. స్త్రీలలో అన్ని వయస్సుల వారిలో ఈనాడు వివిధ రకాల జుట్టు రాలే సమస్యలు పరీక్షించబడుతున్నాయి.

స్త్రీలలో జుట్టురాలే సమస్య అంటే ఏమిటి?

స్త్రీలలో జుట్టు రాలటం పురుషులలో కన్నా చాలా భిన్నమైనది. ఇందులో ఒకింత గందరగోళం కుడా ఉంది. స్త్రీలలో జుట్టు రాలటం జుట్టు సన్నబడటంతో ప్రారంభమవుతుంది, తరువాత అది తల మధ్యలో పెద్ద ప్యాచ్.గా మారుతుంది. స్త్రీలలో జుట్టు రాలే సమస్యను నిర్ధారించడానికి, చికిత్సకు చాలా నైపుణ్యం అవసరం.

స్త్రీలలో జుట్టు రాలడానికి కారణం ఏమిటి?

్త్రీలలో అనేక కారణాల వలన జుట్టు రాలటం సంభవిస్తుంది. వైద్యులను సంప్రదించినంతవరకు కారణం తెలుసుకోలేరు. క్రింద కొన్ని కారణాలు ఉన్నాయి

  • 1. హార్మోన్ల అసమానత
    స్త్రీలలో హార్మోన్ల అసమానతలకు అనేక సందర్భాలు కారణమవుతూ ఉంటాయి. వాటిలో గర్భధారణ, ఒత్తిడి, జనన నియంత్రణ మాత్రలు ఉపయోగించడం, జుట్టురాలే క్రమం వంటివి ఉంటాయి. ఈస్ట్రోజెన్ మరియు డి.హెచ్.టిల అధిక ఉత్పత్తి ఉన్నపుడు స్త్రీలలో హార్మోన్ల అసమానత జుట్టు నష్టానికి దారితీస్తుంది.
  • 2. చికిత్సలు
    కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాదులు ఇందులోకి వస్తాయి. ఉన్నాయి. శరీర రోగనిరోధక వ్యవస్థపై వాటి ప్రభావం వలన అలా జరుగుతుంది.
  • 3. ఇతర కారణాలు
    థైరాయిడ్ గ్రంథి లోపం, తలపై చర్మ వ్యాధులు, నిద్ర లేమి, పొగతాగడం, జుట్టుకు సరైన సంరక్షణ లేకపోవటం, మరియు ఇతర గుర్తించలేని కారణాలు.

జుట్టు రాలడాన్ని గ్రహిస్తే ఏంచేయాలి?

జుట్టు రాలటం క్రమానుగత ప్రక్రియ, కాబట్టి మీరు మీ జుట్టు జీవిత చక్రాన్ని గమనించడం అవసరం. జుట్టు పెరుగుదల తగ్గినట్లు గుర్తిస్తే, ఇంకా జుట్టు నష్టపోకుండా డెర్మటాలజిస్టుని సంప్రదించండి. జుట్టు దువ్వుకోనేటపుడు సాంద్రత (ఒత్తుదనం) తగ్గిందని గుర్తిస్తే డాక్టర్ను సంప్రదించి జుట్టు సంరక్షణ పద్ధతులను తెలుసుకోండి.

స్త్రీలలో జుట్టు రాలటంలో రకాలు

స్త్రీలలో జుట్టు రాలటంలో అనేక రకాల ఉన్నాయి, చర్మవ్యాధి నిపుణులను సంప్రదించినపుడు మాత్రమె వాటిని తెలుసుకోగలుగుతారు.

  • ఆండ్రోజెనిక్ అలోపేసియా
    స్త్రీలలో ఎక్కువమంది ఆండ్రోజెనిక్ అలోపేసియాతో బాధ పడతారు. దీనినే స్త్రీలలో బట్టతలగా పిలుస్తారు. ఇది హార్మోన్ల మార్పు వలన వస్తుంది. ఇది జుట్టు పల్చబడటంతో మొదలై బట్టతలగా తయారవుతుంది.
  • అలోపేసియా ఐరాటా
    దీనిలో అలోపేసియా మోనోలక్యులారిస్, టొటాలిల్, మరియు అలోపేసియా యూనివర్సలిస్ .అను రకాలు ఉంటాయి. జుట్టు రాలే కారణాలలో ఇది ముడవది. దీనిని ఓ విధమైన వ్యాధి నిరోధక రుగ్మత (ఆటో ఇమ్యూన్ డిసార్డర్) అని అంటారు. రోగ నిరోధక శక్తి జుట్టు కణాలు మరియు ఫోలికల్స్.పై దాడిచేసి జుట్టు నష్టానికి దారితీసింది
  • ట్రాక్షన్ అలోపేసియా
    జుట్టు సంరక్షణా అలవాట్లను మార్చుకున్నపుడు ఈ రకమైన జుట్టు నష్టాన్ని నియంత్రించవచ్చు. మితిమీరి స్టైలింగు, బ్రైడింగుల వలన ఫోలికల్స్ దెబ్బతిని జుట్టు రాలటం మొదలవుతుంది.
  • స్కారింగ్ అలోపేసియా
    ఇది అరుదు కానీ స్త్రీలలో ఎవరికైనా రావచ్చు. ఫోలికల్స్ దెబ్బతినటం వలన పూర్తిగా జుట్టు పెరుగుదల ఆగిపోయి మచ్చలుగా ఏర్పడతాయి.
  • ట్రైకోటిల్లోమానియా
    ఇది అరుదే అయినప్పటికీ, జుట్టును లాగేసునే ఒక రుగ్మత కనుక దీనికి చికిత్స అవసరం

స్త్రీలలో జుట్టు రాలడానికి పరిష్కార మార్గాలు

రోగి, డాక్టర్ ఇద్దరు శ్రద్ధ తీసుకోవడం అవసరం. సకాలంలో నిపుణులైన వైద్యుడిని సంప్రదిస్తే ఇంకా జుట్టు నష్టపోకుండా నియంత్రించవచ్చు. నిపుణుడు పరిశీలించి జుట్టు రాలడం యొక్క రకాన్ని నిర్ధారిస్తారు. సరైన చికిత్స మరియు సలహాలను రోగికి అందిస్తారు

స్త్రీలలో జుట్టు రాలడానికి చికిత్స

భారతదేశంలో సర్జికల్ మరియు నాన్సర్జికల్ చికిత్సలు ఉన్నాయి. జుట్టు రాలటాన్ని అధిగమించడానికి స్త్రీలు వీటిని ఆశ్రయించవచ్చు. కింది విధంగా చికిత్సలద్వారా స్త్రీలు జుట్టురాలడాన్ని నయం చేసుకొనవచ్చు.

  • 1.మినోక్సిడిల్
    ఇది నాన్ సర్జికల్ చికిత్స. ఇంజెక్షన్ల రూపంలో చికిత్స అందిస్తారు. నోటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి
  • 2. శస్త్ర చికిత్సలు
    వీటిలో ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు బయో ఎఫ్.యు.ఇలు ఉన్నాయి. సేకరణ భాగం నుండి జుట్టు అంటును సేకరించి స్వీకరణ భాగంపై అలంకరించదానికి శస్త్రచికిత్స నిపుణులు అవసరం. సహజ మరియు అందమైన ఫలితాలను ఇవ్వడానికి సరైన నియమాలు పాటించబడతాయి.
  • 3. థెరపీలు
    ప్లేట్లేట్ రిచ్ ప్లాస్మా థెరపీ, మెసోథెరపీలు దీనిక్రిందకు వస్తాయి. రక్తం నుండి పునరుత్పత్తి సామర్ధ్యం గల సీరంను సేకరిస్తారు. జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి దానిని జుట్టు పలుచబడిన ప్రాంతంలో ప్రవేశపెడతారు. దీనికి మంచి చర్మవ్యాధి నిపుణుడు కావాలి. మీ జుట్టు రాలే తీవ్రతను బట్టి ఎన్ని సార్లు ఈ చికిత్స తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది.
    • 4. ఇతరములు
      ఇవి బట్టతల ఏర్పడటాన్ని తగ్గించలేవు, కానీ సరైన చికిత్స కోసం వెచ్చించ గల నిధుల లేనపుడు వీటిని అనుసరించవచ్చు. అవి విగ్గులు, టోపీలు, మరియు అల్లిన విగ్గులు మొదలగునవి.

జుట్టు రాలడాన్ని ఎలా పరిష్కరించాలి?

మీ అలవాట్లను మార్చుకోండి. క్రమం తప్పకుండా సంతులిట ఆహారాన్ని తీసుకోండి. స్టైలింగ్, జుట్టుకు వేడి తగిలించడం తగ్గించాలి.

 

ఎఫ్.యు.ఇ హెయిర్ ట్రాన్స్ప్లాంట్

అంతర్జాతీయంగా సిఫార్సు చేయబడిన ప్రమాణాలు మరియు ప్రక్రియలను అనుసరించడం ద్వారా అత్యంత జాగ్రత్తతో ఎఫ్.యు.ఇ విధానం అందించడంలో మేము పెరెన్నికగాలవారము.. బట్టతల చికిత్సలలో ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్త్రాక్షన్ పద్ధతి అత్యంత అధునాతనమైన మరియు నమ్మకమైన పరిష్కారంగా చెప్పవచ్చు. ఇందులో, సేకరణ భాగం నుండి ఒక ఫోలికల్ తీసుకొని స్వీకరణ ప్రాంతంలో అమరుస్తాము. దీనిని గురించి తెలుసుకోడానికి ముందు సేకరణ భాగం మరియు స్వీకరణ భాగం అంటే ఏమిటో అర్థం చేసుకోవటం అవసరం.

  • స్వీకరించే భాగం
    దీనిని ప్రభావిత ప్రాంతం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో జుట్టు పూర్తిగా లేకపోవచ్చు లేదా జుట్టు తక్కువ ఉండవచ్చు. ఇది బట్టతలకు కారణమయ్యే డి.హెచ్.టిచే ప్రభావితమవుతుంది. స్వీకరణ ప్రాంతం సమస్యను బట్టి రోగి నుండి రోగికి మారుతుంది. సాధారణంగా పురుషులలో శిరసు పైన బట్టతల కలిగి ఉంటారు, స్త్రీలలో జుట్టు పల్చబడటం ప్రధాన సమస్యగా ఉంటుంది, అందువల్ల వారిలో తల ముందు భాగం స్వీకరాణ ప్రాంతం అవుతుంది.

ఎఫ్.యు.ఇ జుట్టు ట్రాన్స్ప్లాంట్ విధానం ఏమిటి?

మొదట రోగి ఉచిత సంప్రదింపును నమోదు చేసుకుంటారు. సంప్రదింపు రోజు మేము శస్త్రచికిత్స కోసం అవసరమైన రెండు ప్రాథమిక విషయాలు విశ్లేషించడానికి డిజిటల్ స్కాల్ప్ విశ్లేషణ చేస్తాము. మొదటిది రోగి బట్టతల యొక్క వ్యాప్తి మరియు సహజ రూపాన్ని పొందడానికి ఎంత సాంద్రత అవసరమవుతుంది. గ్రాఫ్ట్ సంఖ్య అంచనా వేయడానికి తాత్కాలికంగా మార్కు చేస్తాము. రెండవది డిజిటల్ స్కాల్ప్ విశ్లేషణ ద్వారా సేకరణ ప్రాంతపు ఫాలికల్స్ సాంద్రత లెక్కించడం. హెయిర్ ఫోలికల్స్ యొక్క నష్ట నిరోధకత అంచనా చేస్తాము. 65% వరకు మార్పిడి కోసం ఎంపిక చేయబడతాయి. ప్రతికూల పరిస్థితులను నిరోధించడానికి డాక్టర్ విజయ్ కుమార్ స్వయంగా రోగి ఆరోగ్యం మరియు వైద్య చరిత్రను పరిశీలిస్తారు. శస్త్రచికిత్సకు ముందు రోగికి కొన్ని సూచనలు ఇస్తాము. తద్వారా అనుభవజ్ఞులైన మా బృందం చికిత్స తర్వాత సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను పొందేలా చూస్తారు.

చికిత్సకు ముందు ఏమి చేయాలి

  • శస్త్రచికిత్సకు 7-10 రోజుల ముందు ధూమపానం, మద్యపానం, రక్తాన్ని పలుచన చేసేవి, పొగాకును వాడటాన్ని నియంత్రించాలి.
  • రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సంబంధిత మందులు వాడుతుంటే వాటిని కొనసాగించవచ్చు కానీ శస్త్రచికిత్సకు ముందు వైద్యులకు తెలియజేయాలి.
  • రోగి శస్త్రచికిత్సకు ముందు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. చిరు తిళ్ళు, మసాలా పదార్ధాలకు బదులు పోషక ఆహారాన్ని తీసుకోవాల.
FRANCHISE OPPORTUNITY